
దళితవాడలో సహపంక్తి సన్నబియ భోజనం చేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి లు
వనపర్తి
_
నిరుపేదల ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిరుపేదల కడుపు నింపుతోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు._
ఈ సందర్భంగా వారు సోమవారం వనపర్తి పట్టణంలోని దళితవాడలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త గంధం చిన్ననాగన్న ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరు ఇబ్బందులకు గురికాకూడదని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంతో పాటు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అనిత అని ఎమ్మెల్యే తెలిపారు
ఈ సందర్భంగా ఆయన దళితవాడలోని పలువురి కార్యకర్తల ఇండ్లను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
