TEJA NEWS

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు …

హైదరాబాద్ జిల్లా….
వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ అనుమతులు రావడం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …..

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సిఎం నివాసం నందు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీలు కావ్య , బలరాం నాయక్ , ప్రభుత్వ విప్పులు రామచంద్రనాయక్, లక్ష్మణ్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి, భూక్యా మురళి నాయక్, తో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దోమ్మాటి సాంబయ్య, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి అభినందనలు తెలిపారు…