TEJA NEWS

వీర జవాన్ల సేవలు మరువలేనివి
** శాంతి ర్యాలీలో టీటీడీ యూనియన్ నాయకులు

తిరుపతి: దేశవ్యాప్తంగా, దేశ సరిహద్దుల్లో అనుక్షణం పహారా కాస్తున్న జవాన్ల సేవలను…. ఆ విధుల్లో ప్రాణత్యాగాలు చేస్తున్న వీర జవాన్ల సేవలను ఎప్పటికీ మరువలేమని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ వెంకటేశం కొనియాడారు. ఈనెల 8వ తేది రాత్రి పాకిస్థాన్ – భారత్ యుద్ధ భూమిలో 14 మంది పాకీస్థాన్ తీవ్రవాదులను మట్టికరపించిన భరతమాత ముద్దుబిడ్డ… వీర జవాన్ మురళి నాయక్ దేశం కోసం వీర మరణం పొందారని తెలిపారు. ఆయన నిరుపేద సుగాలి తెగల(బంజారా) కులంలో పుట్టిన ఆణిముత్యుడని, సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, పుట్టగుండ్లపల్లి తాండాకు చెందిన సుగాలి దంపతులకు జన్మించిన ఏకైక సంతానం అని పేర్కొన్నారు. ఆయనకు ప్రభుత్వ రైల్వేలో వచ్చిన ఉద్యోగం కూడా వదులుకొని సైన్యంలో (ఆర్మీ ) చేరాలనే పట్టుదలతో మూడు సంవత్సరాలుగా భారతదేశ సైన్యంలో (ఆర్మీ ) పనిచేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌ – పాకిస్తాన్ కాల్పుల్లో 24 మందిని మట్టి కనిపించిన వీర జవాన్ మురళి నాయక్ మరణం చాలా దిగ్భ్రాంతికరమైనదిగా తెలిపారు.

భారతదేశం ఒక మంచి జవానును కోల్పోయినదని ఆవేదన చెందారు. యావత్ ప్రజలు ఎప్పుడూ వీర జవాన్లకు అండదండలుగా ఉంటారని, వారి కుటుంబాలకు మన ధైర్యాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా భారతదేశం తరఫున యుద్ధభూమిలో మరణించిన వీర జవాన్లకు టీటీడీ ఉద్యోగుల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని టిటిడి ఉద్యోగుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ పరిపాలనభవనం మెయిన్ రోడ్డు నుండి టిటిడి పరిపాలనభవనం 2వ గేటు ప్రధాన కూడలి వరకు ర్యాలీ చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. శాంతి ర్యాలిలో టిటిడి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు జాటోత్ భాస్కర్, జి.వెంకటేశం, జేసీఏ నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, ఆంజనేయులు, డెప్యూటీ ఈఓ ఆనందరాజు, ఎం.ప్రసాద్ రావు, సామిరెడ్డి కల్పన, కట్టమంచి ఇందిరా, వాసు, ఏ.ఆంజనేయులు, రవికుమార్, గుణశేఖర్ పద్మనాభం, దయాకర్, కృష్ణమూర్తి, ఆనంద్ రావు, హరే కృష్ణయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.