
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర జన్మదినం సందర్భంగా వెంగమాంబ అమ్మవారి పల్లకి మోసిన దారపనేని
కనిగిరి

కనిగిరి నియోజకవర్గం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా నరవాడ గ్రామంలో వెలసి ఉన్న జగన్మాత శ్రీ శ్రీ శ్రీ వెంగమాంబ అమ్మవారి పల్లకిని శనివారం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, టి ఎన్ ఎస్ వి జిల్లా కార్యదర్శి పోక నాయుడు బాబు భక్త బృందం తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రమాదేవి , తాళ్లూరు స్నేహ, తాళ్లూరు సౌజన్య తాళ్లూరు సుఖేష్ మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి పల్లకి మోశారు. కనిగిరి నియోజకవర్గం అహర్నిశలు అభివృద్ధి వైపు పయనింప చేస్తూ, నిత్యం ఉచిత వైద్య శిబిరాలతో వృద్ధులకు ఆరోగ్యం పై భరోసా కల్పిస్తున్న శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేరు మీద దేవస్థానం ప్రధాన అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేరుమీద వేదమంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు దారపనేని చంద్రశేఖర్, దారపనేని రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు, పోక నాయుడు బాబు లకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.