TEJA NEWS

జిల్లా ఫస్టు ర్యాంక్ సాధించిన
కల్వకుర్తి విద్యార్థి వెంకటేష్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి రంగాపూర్ గ్రామానికి చెందిన పేదింటి రైతు బిడ్డ వెంకటేష్ హెచ్ ఇ సి, సెకండియర్ విభాగంలో 924 మార్కులతో జిల్లా ఫస్టు ర్యాంకు సాధించాడని కళాశాల ప్రిన్సిపాల్ రామి రెడ్డి సార్,హిస్టరీ లెక్చరర్ సదానందం గౌడ్ తెలియజేశారు.ఈ సందర్భంగా క్రమశిక్షణ , పట్టుదల, అంకితభావంతో గురువులు చెప్పిన ప్రకారం చదువుకొని జిల్లా ఫస్టు ర్యాంక్ సాధించిన వెంకటేష్ కళాశాలకు, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు.