
విజయ్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన బోండా ఉమ, దారపనేని
కనిగిరి
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం వాస్తవ్యులు డాక్టర్ చెనికల శ్రీనివాసులు సోమవారం విజయవాడలో నూతనంగా విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు, దారపనేని చంద్రశేఖర్ డాక్టర్ చెనికల శ్రీనివాసుల ను అభినందించారు. డాక్టర్ చెనికల శ్రీనివాసులు బోండా ఉమామహేశ్వరరావు ను, దారపనేని చంద్రశేఖర్ ను దుశ్యాలవ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ టిడిపి నాయకులు దేవరపు మాల్యాద్రి,నూతలపాటి బాల వెంగయ్య, లక్ష్మయ్య, రాము, వెంకటేశ్వర్లు,చెనికల పెదమాల కొండయ్య, చిన్న మాల కొండయ్య, వెంకటయ్య, మల్లికార్జునరావు, డబ్బుగోట్టు కృష్ణయ్య, మానం మల్లికార్జునరావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ చెనికల నాగార్జున , భాను హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రీనివాస్, చెనికల కుటుంబ సభ్యులు, డాక్టర్లు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
