Spread the love

తానా సభలకు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఆహ్వానం

ఢిల్లీ : ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ల‌కోసారి నిర్వ‌హించే మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను తానా సంఘం ప్ర‌తినిధులు ఆహ్వానించారు. తానా సంఘం ప్ర‌తినిధులు ఢిల్లీలో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా 24వ ద్వై వార్షిక మ‌హాస‌భ‌ల‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా తానా చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ ప్రెసిడెంట్ జయరాం కోమటి, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణంల‌తోపాటు పలువురు ఎన్నారైలు ఉన్నారు.