TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వారావుపేట మండలం గాండ్ల గూడెం గ్రామపంచాయతీలో, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేస్తున్నారంటూ అశ్వారావుపేట మండలం గాండ్ల గూడెం పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు అడ్డుకున్నారు.ప్రజలకు సమాచారం ఇవ్వకుండా దొంగ చాటుగా సర్వే చేయడం ఏంటని ప్రశ్నించారు. పంచాయితీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.