
విజన్ – 2047 చంద్రబాబు దూరదృష్టి మాత్రమే కాదు.. భావితరాల భవిష్యత్ ను నిర్ణయించే యాక్షన్ ప్లాన్ : మాజీమంత్రి ప్రత్తిపాటి.
భవిష్యత్ పరిణామాలను ఊహించలేని అజ్ఞానులే చంద్రబాబు దూరదృష్టి, ఆలోచనల్ని తప్పుపడతారు : ప్రత్తిపాటి.
మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల సమిష్టి ఆలోచనల ప్రతిరూపమే వికసిత్ ఆంధ్రప్రదేశ్ : ప్రత్తిపాటి
భవిష్యత్ గురించి ఆలోచనలేని, రాబోయే పరిణామాలను ముందుచూపుతో గ్రహించలేని అనాలోచనాపరులు, అజ్ఞానులే చంద్రబాబు విజన్ పై విమర్శలు చేస్తారని, గతంలో చంద్రబాబు విజన్-2020 లక్ష్యాలను, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రధాన ఉద్దేశాలను అలాంటివారే తప్పుపడుతున్నారు తప్ప, ప్రజలు కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
అసెంబ్లీలో సోమవారం స్వర్ణాంధ్ర విజన్ : 2047పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీమంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు.
“ విజన్ – 2047 చంద్రబాబు ఆలోచన.. దూరదృష్టి మాత్రమే కాదు.. భావితరాల భవిష్యత్ ను నిర్ణయించే యాక్షన్ ప్లాన్. దీని ముఖ్య ఉద్దేశం తలసరి ఆదాయంపెంపు. ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ.34లక్షలకు పెంచడం. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల
