
మృతుని కుటుంబాన్ని పరామర్శించి అంతక్రియల కు ఆర్థిక సహాయం అందజేసిన……. బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ కౌన్సిలర్ కంచరవి
వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన గోకులం లక్ష్మయ్య మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ కంచ రవి లు మృతుడి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుడి అంతక్రియల కోసం ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
