
పర్యాటకులను సైతం మెప్పించేలా విఎంసి మరుగుదొడ్లు ఉండాలి
విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర
పర్యాటకులను సైతం మెప్పించేలా విఎంసి మరుగుదొడ్లు ఉండాలి అన్నారు విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర. ఉదయం తన పర్యటనలో భాగంగా కేటీ రోడ్, జక్కంపూడి, వైవిఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా కేటీ రోడ్లో గల వియంసి పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యాటకులను సైతం మెప్పించేలా నగర పరిధిలో గల టాయిలెట్లను ఉంచాలని, అధికారులు ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకుంటూ అవసరమైన ప్రతి చోట నూతనంగా టాయిలెట్లను నిర్మించాలని, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లను నగర పరిధిలో గల మూడు సర్కిలలోనూ, సర్కిల్ కి ఒక టాయిలెట్ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, సర్కిల్ 3 పరిధిలో ఒక పింక్ టాయిలెట్ ఉండగా సర్కిల్ 2, సర్కిల్ 1, పరిధిలో కూడా పింక్ టాయిలెట్లను నిర్మించేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించారు.
తదుపరి జక్కంపూడి లోని నిర్మాణం దశలో ఉన్న ఎస్టీపీలను పరిశీలించారు, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఎస్ టి పి లను తో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వైవిఆర్ ఎస్టేట్స్ లో నిర్మాణం దశలో ఉన్న రిజర్వాయర్ ను పరిశీలించారు. త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి త్రాగునీటి సమస్యను ఏమాత్రం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాతపాడు లోని పిగ్ షెడ్ ను పరిశీలించారు, అక్కడ కావాల్సిన వసతులన్నీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి అయోధ్య నగర్ లో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలను ఆహార నాణ్యత, త్రాగునీటి సరఫరా, వాడుక నీటి సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు ఇన్చార్జ్ ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ లత, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, సిబ్బంది పాల్గొన్నారు.
