
వనపర్తి నూతనమున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు*.
వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీకి బదిలీపై విచ్చేసిన నూతన కమిషనర్ వెంకటేశ్వర్లు ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష. కమిషనర్ ని శాలువాతో సన్మానించారు… అనంతరం
ఖాదర్ పాష మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులలో పారిశుద్ధ్యం పడకేసిందని పట్టణ పరిశుద్ధ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పట్టణంలోని వార్డులలో అభివృద్ధి కుంటు పడకుండా పాటుపడాలని ముఖ్యంగా 22వ వార్డును కూడా అభివృద్ధి కొరకు మరియు వార్డులలో నీటి సమస్య డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు ఆర్టీసీ కాలనీలో బసవన్న గడ్డలో 22వ వార్డు గణేష్ నగర్ శ్వేతా నగర్ కాలనీలలో నీటి సమస్య లేకుండా పైపులు లీకేజీ లేకుండా ఎక్కడన్నా లైన్మెన్ ల ద్వారా సమాచారం తీసుకొని సరి చేయించి నీళ్లు వృధాగా పోకుండా నీటిని కాపాడాలని ప్రతి వార్డులలో కాలనీలలో స్వయంగా అధికారులు సిబ్బంది సందర్శించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుచుటకు తగు అభివృద్ధి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరారు కమిషనర్ అందుకు సానుకూలంగా స్పందించి ఎక్క డ లీకేజ్ ఉందో పైప్ లైన్ డామేజ్ ఉన్నాచో వెంటనే సరి చేస్తామని అన్నారు. …
పాల్గొన్నవారు మోచి సంఘం ప్రెసిడెంట్ A. శంకర్ బాబు. మండల నాయకులు ఎండి సమీ తదితరులు పాల్గొన్నారు..
