Spread the love

జల దోపిడిని అడ్డుకోవాలి
రౌండు టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు

నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లా
కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో పాలమూరు అధ్యయన వేదిక, కల్వకుర్తి జేఏసీ ఆద్వర్యంలో జల దోపిడిపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్వకేట్ వెంకట్ గౌడు అద్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులు పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మరియు ఇరిగేషన్ నిపుణులు కేవి హాజరైనారు.
1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నీళ్ళ విషయంలో పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయానికి గురి చేసింది. అంతే గాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వరాష్ట్రంలో కూడా పాలమూరు జిల్లా కు అదే దుస్థితి.
కండ్లమందే మన దక్కాల్సిన నీటిని పట్టపగలే నల్లగొండ జిల్లాకు తరలించుక పోతుంటే అడ్డగించాల్సిన 14 మంది ప్రజాప్రతినిధులు నోరు మెదపడంలేదని ఎం, రాఘవాచారి ప్రశ్నించారు.
కరువు కాలానాగై కాటేసింది
ఆకలి ఆ పైన జత కల్సింది
వలస నొసటి రాతై నిల్సింది
బతుకు బండరాయై పోయింది
ఇది మన పాలమూరు జిల్లా కథ
పాలమూరు రైతుల కన్నీటి వ్యధ
గత దశాబ్దాలుగా కరువు, పేదరికము, నిరుద్యోగము, వలసలు, అవిద్య, అనారోగ్యము,కుటుంబ జీవన విధ్వంసం ఈ పాలమూరు జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. దేశమంతటా ఎన్నో ప్రాజెక్టులు కట్టి,కాలువలు త్రొవ్వి, భీడు భూముల్ని పంటపొలాలుగా మార్చి తమ చెమట నెత్తురుని దారబోసిన పాలమూరు రైతాంగ బిడ్డలు నేడు సాగునీరు లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు.
వలసల జిల్లా, లేబర్ జిల్లాగా ఉన్న పాలమూరు రిజర్వాయర్ల జిల్లాగా మారేదెన్నడు ?అని రాఘవాచారి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లా అనేక ఇబ్బందుల పాలయ్యాము. స్వరాష్ట్రంలో కూడా పాలమూరు జిల్లా కన్నీటి కడగండ్లతో ,చితికిన బతుకులతో జీవిస్తున్నారు. మన కళ్ళముందే పాలమూరు జిల్లా రైతాంగానికి దక్కాల్సి కృష్ణా నది నీళ్ళను ఏదుల రిజర్వాయర్ ద్వారా నల్లగొండ జిల్లాకు తరలించెందుకు కుట్ర జరుగుతుంది.
పాలమూరు జిల్లాకు చెందిన రైతాంగం ముఖ్యమంత్రి గారితో సహా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నీళ్ళ తరలింపు ఆపెందుకు నోరు మెదపలేని దుస్థితి. మన పాలమూరు రైతు బిడ్డే పాలకుడుగా ఉన్నారు. ప్రశ్నించేవాడు కూడా పాలమూరు జిల్లా నుంచి ఉన్నాడు . నీటిని నల్లగొండ జిల్లాకు తరలించుక పోతున్న ఈ విధానాన్ని వివిధ పార్టీల వారు ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ కార్యక్రమంలో జేఏసి చైర్మన్ సదానందం గౌడు సిఐటియు ఆంజనేయులు, కెవిపిఎస్ పరశురాములు, బిజెపి బాబీ దేవ్, సిపిఐ పరశురాములు, బిఎస్పి అంజి ,బీసీ సబ్ ప్లాన్ రాజేందర్ ,గోపాల్ సైదులు యాదవ్ తెలంగాణ ఉద్యమకారులు బాలయ్య సార్, జంగయ్య మొదలవారు పాల్గొన్నారు.