
వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారం డివిజన్ “ఓక్షిత హిల్ వ్యూ” కాలనీలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీలో నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, వరదనీటి సమస్యను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాలనీలో నెలకొని భూగర్భ డ్రైనేజీ, వరద నీటి సమస్యకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్.ఈ.చెన్నారెడ్డి, ఈఈ కిష్టప్ప, వాటర్ వర్క్స్ అధికారులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, ఓక్షిత హిల్ వ్యూ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణ, సురేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
