Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం-నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోలన్ హన్మంత్ రెడ్డి ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ప్రగతి నగర్ పరిధిలోని శిల్ప పారడైస్ కల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పలు కాలనీ అభివృద్ధి కొరకు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పలు వినతులు స్వీకరించిన హన్మంతన్న వాటి పరిష్కారం కోసం, ఆయా కాలనీల అభివృద్ధి కోసం పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు .