TEJA NEWS
  • తెలుగుదేశం పార్టీ కోసం మనం ఏం చేసాం అనే మాటకు నిలువెత్తు రూపం మద్దిబోయిన కుటుంబం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణా కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిబోయిన శివ గారి తనయుడు మద్దిబోయిన వెంకటేష్, జయంతి వేడుకల్లో పాల్గొన్న చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు…తెలుగుదేశం పార్టీ కోసం మనం ఏమి చేశాం అనే మాటకు నిలువెత్తు రూపం, మద్దిబోయిన కుటుంబం పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరగటం మరణించటం జరిగింది. మద్దిబోయిన వెంకటేష్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఆ కుటుంబానికి మనం ఏమి చేసినా ఎన్నిచ్చినా ఏమి చేయాలన్నా ఆ కుటుంబం రుణం తీర్చుకోలేము. ఎదిగొచ్చిన బిడ్డ మరణించటం ఆ తల్లిదండ్రులు పడే వేదన ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన మాటల్లో ఎలా చెప్పాలి ఆ కుటుంబ సభ్యులు మా మనసులో ఎల్లప్పుడూ ఉంటారు మా సొంత కుటుంబం మా కళ్ళముందే వెంకటేష్ ఉన్నాడు అనడానికి నిదర్శనం ఈ కార్యక్రమం ఈ మదర్ థెరీసా విగ్రహం అంటూ.. మద్దిబోయిన వెంకటేష్ జన్మదిన పురస్కరించుకొని ముందుగా మద్దిబోయిన వెంకటేష్ జ్ఞాపకార్థంగా నిర్మించిన మదర్ థెరీసా విగ్రహానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
    అనంతరం భారీ కే కట్ చేసి మరియు ఎండల కాలం పేదలకు ఇబ్బంది లేకుండా మంచినీరు చలివేంద్రం ప్రారంభించి వెయ్యి మంది పైచిలుకు నిరుపేదలకు మహా అన్నదాన కార్యక్రమాని ప్రత్తిపాటి ప్రారంభించారు. వేల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మద్దిబోయిన వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ. నీ ఆత్మకు శాంతి కలగాలనీ కోరుకున్నారు.
    ఇక్కడ వచ్చిన మద్దిబోయిన కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు తెలిపారు.నా కొడుకు మద్దిబోయిన వెంకటేష్ మరణం మేము జీర్ణించుకోలేనిదే కానీ మా మధ్య మా తోటి మా మనసులో ఎల్లప్పుడూ ఉన్నాడు మా మద్దిబోయిన కుటుంబ సభ్యులు మనసులో ఎప్పుడూ ఉంటాడు.. ఈరోజు మా ప్రియతమ నాయకుడు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు విచ్చేసి మా బిడ్డ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యరధ మహారధులు టిడిపి జనసేన బిజెపి వివిధ హోదాల్లో పాల్గొన్న నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వ కార్యదర్శి మద్దిబోయిన శివ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు…