
కవిత పేరుతో లేఖ.. మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే?
కేసీఆర్కు కవిత రాసినట్లుగా ఓ లేఖ వైరలవుతుండటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆ లేఖను సృష్టించే అవసరం తమకు లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి లేక బీజేపీకి ఓటేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఎలాంటి చీలిక లేదని, ఇదంతా ఓ డ్రామా అని దుయ్యబట్టారు. తండ్రికి ఆమె లేఖ రాయాల్సిన అవసరం ఏంటని, నేరుగా చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు.
