
ఈడెన్ గార్డెన్స్ లో గెలుపు ఎవరిది?
ప్రతీకారంతో రగిలిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్:
ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో తలపడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గతేడాది సన్ రైజర్స్‌తో ఆడిన మూడు మ్యాచు ల్లోనూ గెలిచిన కేకేఆర్.. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు.
కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ కూడా ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వలేకపోయా యి. గతేడాది పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లూ అగ్రస్థానంలో నిలిచాయి. కానీ ఈసారి మాత్రం ఆడిన మూడింట్లో రెండు మ్యాచ్‌ల లో ఓడి.. 10, 8వ స్థానాల్లో కేకేఆర్, SRH ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్..
సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ స్పష్టమైన ఆధిక్యం కనబ రిచింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య 28 మ్యాచులు జరిగాయి. అందులో కేకేఆర్..

ఏకంగా 19 మ్యాచులలో గెలిచింది. మరో తొమ్మిదింట్లో సన్ రైజర్స్ గెలిచింది. 2020 నుంచి ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య 11 మ్యాచులు జరగ్గా.. అందులో తొమ్మిది మ్యాచులలో సన్ రైజర్స్ ఓడిపోయింది.