TEJA NEWS

ప్రజల సహకారంతోనే సమాజాన్ని మరింత భద్రత.

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

భారతదేశ వ్యాప్తంగాగా నెలకొన్న యుద్ధ వాతావరణ మరియు సరిహద్దు జిల్లాలో మావోయిస్టుల అలజడులా నేపథ్యంలో నిఘా మరింతగా బలపరిచేందుకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు (Vehicle Checkings) నిర్వహించడం జరిగింది.

సాయంత్రం మరియు రాత్రి వేళల్లో సడెన్ చెకింగ్స్ (Surprise Checks) నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించి విచారణ చేయడం జరుగుతుంది.

బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు ప్రత్యేక బలగాలతో నిఘా చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచబడింది.

గ్రామ స్థాయిలో పోలీస్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సూచనలు:

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, సంచయాలు లేదా కార్యకలాపాలు కనిపించిన పక్షంలో వెంటనే 100 నెంబర్ కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగలరు. మీ సహకారం వల్లే మేము సమాజాన్ని మరింత భద్రమైనదిగా తీర్చిదిద్దగలము అని తెలిపారు.