
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎంఈఓలతో నెల్లూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష
మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష
వైసీపీ పాలనలో నాడు – నేడు పేరుతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేశారు
ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5. తరగతులను తీసుకెళ్లి హైస్కూళ్లలో కలిపి గందరగోళానికి తెరలేపారు
ఇప్పుడు విద్యావంతుడైన నారా లోకేష్ బాబు నాయకత్వంలో విద్యారంగంలో విశేష మార్పులు తెస్తున్నారు
1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్స్, ఇద్దరు టీచర్లతో 1 నుంచి ఐదు తరగతులతో బేసిక్ ప్రైమరీ స్కూళ్లు, 1 నుంచి ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లతో మోడల్ ప్రైమరీ స్కూళ్లు రాబోతున్నాయి
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఐదుగురు టీచర్లతో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయి
స్కూళ్లు చిన్నారులకు కొంచెం దూరమైతే రవాణా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.600 చొప్పున అందించేందుకు సిద్ధమైంది
పేద పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యాబోధనే లక్ష్యంగా ప్రభుత్వం మార్పులు చేపట్టింది
ప్రతి ఒక్కరూ సహకరించి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు సహకరించాలని కోరుతున్నాం
