Spread the love

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

MMTS రైలు ఘటనపై MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నా’ అని తెలిపారు.