
నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ రోడ్డెక్కిన మహిళలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వారావుపేట మండలంలోని కొత్త నగర్ కాలనీలో,మున్సిపాలిటీ బోరు మోటర్ పనిచేయడం లేదు. ఆ కాలనీ మహిళలు పది రోజుల నుండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో కాలనీ మహిళలు రోడ్డెక్కారు. మా సమస్యలు పట్టించుకునే వారే లేరని రోడ్లపై కొచ్చి ఆందోళన చేస్తున్నారు. జీతాలు టయానికి తీసుకుంటారు గాని మాకు ఏదైనా సమస్య వస్తే పట్టించుకోరు అంటూ వారి సమస్యలు చెప్పుకొచ్చారు. బోర్ మోటర్ మరమ్మతులకు గురైన కారణంగా ఆ కాలనీవాసులకు ట్యాంకర్ తో వాటర్ సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ లో వాటర్ కూడా బురద వాటర్ అని ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ బోర్ మోటార్ మరమ్మతులకు గురై నా ఇప్పటివరకు అధికారులు బాగు చేయించలేదని వారు చెప్పుకొచ్చారు . పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.
