
మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలు
- ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గుంటూరులోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, బాలల పరిరక్షణ విభాగం, గృహ హింస నిరోధక విభాగం, ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లను ఆకస్మికంగా పరిశీలించారు.
- శక్తి సదన్‌లో ఉండే బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు, అవసరమైన సహాయాలు అందిస్తున్నామని తెలిపారు.
- గత వైసీపీ పాలనలో దిశా చట్టం పేరుతో మహిళలను మోసం చేశారని, కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.
- రాబోయే రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామని, రాజధాని మహిళ రైతులపై జరిగిన దాడులపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
