TEJA NEWS

మహిళల భద్రత తెలుగుదేశం పార్టీ భాధ్యత – MLA బొండా ఉమ

యువత తల్లితండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు

మహిళలు రక్షణ, యువత భవిష్యత్తు టీడీపీ ధ్యేయం

ధి:3-4-2025  గురువారం సాయంత్రం 4:00″గం లకు ” విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు వన్ స్టాప్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు, గౌ|| శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మరియు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని ప్రారంభించారు…

ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గంలో వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు, పోస్కో చట్టాలు కానీ, అలాగే పెళ్లి అయినటువంటి ఆడవారి మీద వేధింపులు కానీ ఇలాంటివి ఎక్కడ పునరావృతం కాకుండా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తున్నామని, మహిళల పైన వేధింపులు జరిగితే అధికారులతో పాటు మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది 24/7 సిబ్బందితో మానిటర్ చేసి, ప్రొటెక్టు చేస్తూ సర్వీస్ చేస్తారని…

వీటితోపాటు పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,…

గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అటువంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా చేస్తున్నామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కథ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఆకాశయాలు జరిగినయని ఇదే గవర్నమెంట్ ఆసుపత్రిలో మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి మైనర్ బాలిక మీద జరిగితే అప్పటి ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబునాయుడు గారు ఏ ఆసుపత్రికి విచ్చేసి ఆమెను పరామర్శించి ₹10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా చేశారని, అధికారంలో ఉన్న లేకపోయినా మహిళల భద్రత తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని…

నేడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఇటువంటి అవాంచిత సంఘటనలు ఎక్కడ జరిగిన ఉపేక్షించకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారని బొండా ఉమ గారు తెలియజేసారు…

WhatsApp Image 2025 04 03 at 5.52.08 PM
WhatsApp Image 2025 04 03 at 5.52.08 PM