TEJA NEWS

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే టి .ఎన్ .టి. యు. సి.

పిడుగురాళ్ల మేడే కార్మికుల దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విభాగం టి.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి షాదీఖానా వరకు నిర్వహించిన భారీ ర్యాలీని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు, అనంతరం పిల్లుట్ల రోడ్డులోని షాదీఖానా ఎదురుగా ఏర్పాటు చేసిన టి.ఎన్.టి.యు.సి జెండాను ఎగురవేయడం జరిగింది. అనంతరం షాదీఖానా నందు ఏర్పాటు చేసిన సభలో మేడే గురించి, కార్మికులను ఉద్దేశించి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రసంగించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు యరపతినేని ఖాకి డ్రస్సులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి నాయకులు, కూటమి నాయకులు, కార్మికులు, మహిళలు పాల్గొనడం జరిగింది.