TEJA NEWS

ఆధునిక క్రీడలు ఎన్ని పుట్టుకొచ్చిన కుస్తీ పోటీలు ( రెజ్లింగ్) కు మాత్రం ఆదరణ తగ్గలేదని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత మూడు రోజుల నుండి LB స్టేడియం లో జరుగుతున్న 3 వ మహావీర్ తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, MLC కల్వకుంట్ల కవిత లు హాజరై టైటిల్ విన్నర్ మొదటి విజేతగా నిలిచిన హైదరాబాద్ కు చెందిన ముస్తఫా బిన్ అలీ, రెండో విజేతగా నిలిచిన సాయి కిరణ్, కేవల్ యాదవ్ లకు బహుమతులతో పాటు ప్రైజ్ మనీ ని అందజేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 5 వేల సంవత్సరాల నుండి ఈ క్రీడ ఉన్నదని చరిత్ర ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ పోటీలలో వివిధ కేటగిరీలలో 30 రాష్ట్రాలకు చెందిన 440 మంది పాల్గొన్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA ముఠా గోపాల్, BC సంఘం నాయకులు చిన శ్రీశైలం యాదవ్, యువ నాయకులు నవీన్ యాదవ్, ముఠా జై సింహ, నిర్వహకులు మెట్టు శివ తదితరులు పాల్గొన్నారు.