
శంకర్‌పల్లిలో విజేత సూపర్ మార్కెట్ 150వ స్టోర్ ను ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ 150 వ స్టోర్ ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య సూపర్ మార్కెట్ భవన యజమానులు పురం గోపికృష్ణ, మాజీ సర్పంచ్ రాజశేఖర్ లను అభినందించి, శాలువాలతో సత్కరించి, మిఠాయి తినిపించారు. సూపర్ మార్కెట్ యాజమాన్యం, భవన యజమానులు కలిసి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి బుద్ధుడి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిధిలో సూపర్ మార్కెట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విజేత సూపర్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ చౌదరి మాట్లాడుతూ 1999లో ప్రారంభించిన విజేత సూపర్ మార్కెట్ ఒక బ్రాండ్ గా నిలిచిందని, 25 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు శంకర్‌పల్లిలో ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. అన్ని జిల్లాల్లో విస్తరిస్తామని, కస్టమర్లకు నాణ్యమైన సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్టోర్ ల ఇంచార్జ్ బిజినెస్ హెడ్ హరికృష్ణ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దండు రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రకాష్, నాయకులు బాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు సలీం తదితరులు పాల్గొన్నారు.
