
వైఎస్సార్ 76 వ జయంతి సందర్భంగా ఘన నివాళి ఎర్నేని వెంకటరత్నం బాబు…
కోదాడ సూర్యాపేట జిల్లా : దిగవంత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ప్రమీల టవర్ వద్ద ఉన్న మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహృదయ నేతకు నివాళి, రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశా నిర్దేశం చేసిన నాయకులు, రైతు బంధువుగా ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి. వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో ప్రజా పాలన సాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రావెళ్ల కృష్ణారావు, చామర్తి బ్రహ్మం, నెమ్మాది ప్రకాష్ దేవమణి, మైలారిశెట్టి భాస్కర్, గంధం పాండు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
