TEJA NEWS

వైసీపీ అంటేనే కుట్రలు.. కుతంత్రాలు

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
….

చిత్తూరు: జగన్ రెడ్డికి చెందిన వైసీపీ అంటేనే రాష్ట్ర వినాశనం కోరుతూ కుట్రలు…కుతంత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మైనారిటీ నాయకుడు జాఫర్ , విద్యార్థి నాయకుడు ప్రభుతేజలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. సురేంద్ర కుమార్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత – మంత్రి నారా లోకేష్ అలుపెరగక విదేశీ పెట్టుబడుల కోసం శ్రమిస్తుంటే… వైసీపీ
ముఠా మాత్రం తమ అధినేత జగన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతిష్టను ఎలా దిగజార్చాలి, అభివృద్ధిని ఎలా
అడ్డుకోవాలి అని రోజూ కుట్రలు పన్నుతూనే ఉందని మండిపడ్డారు. కల్తీ మద్యం – డ్రగ్స్ దందా ఒకే రకమైన కుట్ర అనేది వైసీపీ ముఠాకి మాత్రమే తెలిసిన నీచ
రాజకీయం అని విమర్శించారు. వైసీపీ ఏకైక లక్ష్యం కూటమి ప్రభుత్వంపై బురద చల్లటం, రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులు రాకుండా కుట్రలు చేయడమే అన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా జగన్ డైరెక్షన్…జోగి యాక్షన్లో నకిలీ మద్యం ఫార్ములా రూపొందించారని పేర్కొన్నారు. కల్తీ సారా తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసి, “కూటమి ప్రభుత్వంలో మద్యం మాఫియా పెరిగిపోయింది” అని దుష్ప్రచారం చేయాలని కుట్ర వేశారు. అయితే అడ్డంగా దొరికిపోయిన తర్వాత కులం అంటూ కుల రాజకీయాలు మొదలు పెట్టారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తుంటే… తాజాగా తాడేపల్లి ప్యాలస్ నుంచి మరో కుట్రకు తెరలేపారు.
భారీ పెట్టుబడుల గూగుల్ రాకతో ఏఐ హబ్, యువత కలలు కనే నగరంగా విశాఖ
ఎదుగుతుంటే తట్టుకోలేక పోతున్న వైసీపీ ముఠా ఈ నగరాన్ని ‘మత్తు’ రాజధానిగా మార్చాలని నీచాతి నీచానికి వైసీపీ దిగజారిందన్నారు. అందులో
వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి గంజాయి
సరఫరా చేస్తూ అడ్డంగా ఈగల్ టీంకి చిక్కాడు.
“అడ్డంగా దొరికిపోయిన కొండారెడ్డి… జగన్మోహన్ రెడ్డితో, గుడివాడ అమర్నాథ్ రెడ్డితో రాజకీయ
సంబంధాలుండటంతో ఈ చీకటి గంజాయి వ్యాపారం వెనుక ఎంత పెద్ద రాజకీయ అండదండలు ఉండేవో
అర్ధం చేసుకోవచ్చు అన్నారు. యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన పార్టీ పదవిలో ఉండి, యువతనే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్
దందాకు తెరతీశారంటే, వైసీపీ రాజకీయం ఏ స్థాయిలో దిగజారిందో అర్థమవుతుంది. గత ఐదేళ్లు వైసీపీ ముఠా ఇంజనీరింగ్ కళాశాలలు, హాస్టళ్లు, యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ నెట్వర్క్ నడిపింది.
అధికారం కోల్పోయిన తరువాత ప్రభుత్వంపై బురద చల్లడానికి మళ్ళీ అదే దందా మొదలు
పెట్టారు. డ్రగ్స్ తో దొరికిపోయిన వాడిని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా జగన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అతిపెద్ద మద్యం స్కాంలో జైలులో ఉన్న పార్టీ నాయకులను , నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి జోగి రమేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం మాని బహిరంగంగా వెనకేసుకు వస్తున్న జగన్ వైఖరి ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు.
టెర్రరిస్టు ముఠాలు తమ కార్యకలాపాల ఖర్చుల కోసం డ్రగ్స్ దందా, అక్రమ ఆయుధాల విక్రయాలు ఎంచుకున్నట్టు…., అధికారం కోసం, డబ్బు కోసం నీచపు పనులతో దందాలు
నడిపిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ మాత్రమే అని వెంకిటీల వ్యాఖ్యానించారు.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా తాడేపల్లి ప్యాలెస్
కేంద్రంగా కల్తీ మద్యం, డ్రగ్స్ సరఫరా కుట్రలు రచించారు.
వైసీపీ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలు…నాడు అధికారం కోసం సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపి… నారాసుర రక్త చరిత్ర
అంటూ తప్పుడు ప్రచారం చేశారు. లేని పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని తప్పుడు ప్రచారం నడిపారు…
అధికారం కోల్పోయిన వైసీపీ ముఠా తీరులో మాత్రం మార్పు రాలేదు.
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలనే ఒకే లక్ష్యంతో తాడేపల్లి ప్యాలస్ డైరెక్షన్లో వైసీపీ ముఠా రోజూ
విషం చిమ్ముతూనే ఉంది.
యువత , విద్యార్థులు వైకాపా వైపు అడుగులు వేస్తే మీ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకున్నట్లే అనే విషయం గ్రహించి ఆ పార్టీ నాయకుల చెంతకు చేరకండి అని యువత , విద్యార్థులకు సూచించారు.