బుధ. మార్చి 11th, 2026

మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం

WhatsApp Image 2025 04 01 at 14.16.30
WhatsApp Image 2025 04 01 at 14.16.30
TEJA NEWS

మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకం||
ఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐ ఎన్ని సత్యానందరావు మరియు హెడ్ కానిస్టేబుల్ అదపాక భాస్కరరావు అభినందించిన సహోద్యోగులు

పోలీసుశాఖకు వారందించిన సేవలను కొనియాడుతూ ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్

సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) పోలీసు కంట్రోల్ రూం ఎస్సై ఎన్ని సత్యానందరావు (2) గుర్ల పి.ఎస్., హెచ్.సి ఎ.భాస్కరరావులను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో
ఏప్రిల్ 1న ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ పోలీసుశాఖకు సుదీర్గ కాలం మంచి సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్సై ఎన్ని సత్యానందరావు, హెడ్ కానిస్టేబుల్ అదపాక
భాస్కరరావులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విధులను నిర్వహించడంలో క్రమశిక్షణ, అంకిత భావంతో పని
చేసి, ఇతర పోలీసు ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. పోలీసు ఉద్యోగంలో ప్రతీ రోజూ ఒక కొత్త
రకమైన సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని, సవాళ్ళును అధిగమించాల్సి
ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులనువారి విధులను సక్రమంగా నిర్వహించడంలోను,
వారి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను, వారి భాగస్వామ్యుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగ విరమణ
తరువాత పోలీసు ఉద్యోగులు తమ సమయాన్ని ఆరోగ్యంపైనా, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెచ్చించాలని
జిల్లా ఎస్పీ కోరారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులు తమ సర్వీసులో ఎదురైన అనుభవాలను,
విలువైన సలహాలను పోలీసుశాఖకు అందించాలన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ భరోసా కల్పించారు.

అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్సై ఎన్ని సత్యానందరావు దంపతులను, హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు దంపతులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సాలువలు,w పూల మాలలు, గిఫ్ట్, సన్మాన పత్రాలతో సత్కరించి, ఘనంగాw “ఆత్మీయ వీడ్కోలు” పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ జ్ఞాపికలను, చెట్లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు వారి సర్వీసులో
సహకరించిన అధికారులకు, సిబ్బందికి తమ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుశాఖ తరుపున ఎస్పీ తమకు
“ఆత్మీయ వీడ్కోలు” ను వలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీకృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.
చౌదరి, కంట్రోల్ రూం సిఐ వైకుంఠరావు,w ఎస్ఐలు జగదీశ్వరరావు, శంకర్రావు, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాసరావు, కోఆపరేటివ్ కార్యదర్శి నీలకంఠం నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page