శంకర్ పల్లి అనుమానం పెనుభూతమైంది. భర్త కాలయముడై భార్యను అతి కిరాకర్తకంగా చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో వడ్డే మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కాగా భర్త మాణిక్యం కు భార్య యాదమ్మ పై అనుమానం కలగడంతో ఆమెను వేధిస్తుండేవాడు. అయితే యాదమ్మ రాత్రి గం. 12:30 ల ప్రాంతంలో ఇంటి ఆరు బయట నిద్రిస్తుండగా, భర్త మాణిక్యం ఆమె తలపై గ్రానైట్ రాయితో మోదాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నది. ఇద్దరు కుమారులు ఉండగా, వీరి పెళ్లిళ్లు కావడంతో వేరే ఉంటున్నారు. మోకిల సీఐ వీరబాబు, ఎస్సై కోటేశ్వరరావు లు సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…