Terror attack on pilgrims, 10 people killed..
స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్
ఢిల్లీ:-ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. గాయపడిన వారు నోయిడా-ఘజియాబాద్, ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ దాడి గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ ఉగ్రదాడిని ఖండించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉగ్రవాదుల గాలింపు కోసం భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయని, దాడి వెనుక ఉన్న వారిని విడిచిపెట్టబోమని ఎల్‌జీ సిన్హా స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు చర్య వెనుక ఎవరు ఉన్నా కూడా వారికి త్వరలోనే శిక్ష పడుతుందన్నారు.