TEJA NEWS

రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు

2676 ఎగ్జామ్ సెంట‌ర్స్

అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్

నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు

హైదరాబాద్:మార్చి 07
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి.

ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్‌ టికెట్లను స్కూళ్లకు అధికా రులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయ గా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవను న్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగ నున్నాయి. మరోవైపు,18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి.

ఇక టెన్త్ ప‌రీక్ష‌ల‌లోనూ నిమిషం నిబంధ‌న‌లో మార్పు చేశారు..గ్రేస్ పిరియ‌డ్ ను అయిదు నిమిషాల‌కు పెంచారు..


TEJA NEWS