TEJA NEWS

Warangal: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ: 12మందికి గాయాలు

ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌, ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు..

నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు..

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించడంతో మేడారం వెళ్లే భక్తులు గంటన్నరపాటు ఇబ్బందులు పడ్డారు..


TEJA NEWS