TEJA NEWS

సూర్యాపేటలో కాంట్రాక్టు పద్ధతిలో 12 పోస్టులు భర్తీ

సూర్యాపేట జిల్లా : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, సూర్యాపేట పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ (12) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించిన సెలెక్టెడ్ అభ్యర్ధుల లిస్ట్ ను
http.suryapet.telangana.gov.in
వెబ్ సైటు నందు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, సూర్యాపేట వారి కార్యాలయము నోటీసు బోర్డులో ఉంచనైనది.

పోస్టులు (12) వివరాలు :

1.డిస్ట్రిక్టు క్వాలిటి అష్యూరెన్స్ మేనేజర్ – 01
2.ల్యాబ్ క్వాలిటి మేనేజర్ -01
3.డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ -02
4.ఫార్మసీష్టు-03
5.రేడిఓగ్రాఫర్-02
6.ANM -02
7.సప్పోర్టింగు స్టాఫ్-౦1

కావున పైన పేర్కొన్న (12) పోస్టులకు గాను సెలెక్టు అయిన అభ్యర్ధులకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ది:02/11/2024న (శనివారం) ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాకాధికారి కార్యాలము నందు నిర్వహించబడును .
కావున తెలియజేయునైనది.


TEJA NEWS