TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద సుమారు రెండున్నర కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న పైప్ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రగతినగర్ పరిసర ప్రాంతాల నుండి వస్తున్న డ్రైనేజీ నీరు ఎల్లమ్మ చెరువులో కలిసి కలుషితం అవ్వడం వల్ల దోమల బెడద, దుర్వాసన రావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. పై నుండి వస్తున్న డ్రైనేజీ నీరును ఎల్లమ్మచెరువులో కలవకుండా దారి మళ్లించే విధంగా పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తయిందంటే ఎల్లమ్మచెరువులో డ్రైనేజీ నీరు కూడా కలవదు కాబట్టి చెరువు నీరు శుభ్రంగా ఉండి గుఱ్ఱపుడెక్క పెరగడం, దుర్వాసన రావడం, దోమల బెడద వంటి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, ఎం.ఆర్.కె రెడ్డి, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.