TEJA NEWS

క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా ఆదర్శ్ నగర్ లోని గ్లోరియస్ ప్రార్థన మందిరం పాస్టర్ యం.యం.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ చేతులమీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాస్టర్స్ రెవ ఏడివి ప్రసాద్, యం.రాజు, సామ్ జాషువ, జయరాజు, ఏ. గోపి, శైలిస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS