TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రహిల్స్ మరియు రాంకి పెరల్ మధ్యలో ఉన్న నాలా వద్ద చెత్త పేరుకుపోయి దోమల సమస్య ఎక్కువగా ఉందని చుట్టుప్రక్కల ఉన్న కాలనీ ప్రజలు సమస్యను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ సమస్యను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి నాలా వద్ద ఉన్న చెత్తను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కూడా తమవంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వారానికి ఒకసారైనా తనిఖీచేసుకుని మీ ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని అన్నారు.

చెత్తను వీధుల్లోనూ కాలువలోను చెరువుల్లోనూ వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS