124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనిఖీ చేసి, వారు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పల్లె, బస్తి దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపేనే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని రోగాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లోని పల్లె దవాఖానలో బిపి మరియు షుగర్ కు సంబందించిన మాత్రల(టాబ్లెట్స్) కొరత ఉందని డాక్టర్ గారితో మాట్లాడిన తరువాత తెలిసిందని అన్నారు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాత్రలు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, బి.వెంకటేష్ గౌడ్, కుమార చారి, రాంరెడ్డి, రఘు, నరసింహ రెడ్డి, హేమలత, రాజేందర్, డాక్టర్ సాయి కృష్ణ, ఏ.ఎన్.ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు.
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…