ముష్కరుల దాడిలో 20 మంది మైనర్లు మృతి
ముష్కరుల దాడిలో 20 మంది మైనర్లు మృతి
నైరుతి పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 20 మంది మైనర్లు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్థరాత్రి దుకీ జిల్లాలోని బొగ్గు గని వద్ద ఉన్న వసతి గృహాల్లోకి ముష్కరులు చొరబడి.. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మైనర్లు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్ పౌరులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.