TEJA NEWS

సంస్కరణల సాధకుడికి ఘన నివాళి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :

భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు..

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

భారత దేశ మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఒకరని పేర్కొన్నారు.గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు రెండు పదవీ కాలాల్లో భారత ప్రధానమంత్రిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోనూ… ఆయన ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయని తెలిపారు. అలాంటి మహనీయున్ని దేశం ఈరోజు కోల్పోయిందని వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు


TEJA NEWS