TEJA NEWS

రాష్ట్ర జనాభాలో 25 శాతమైనా నిత్యం యోగా చేయాలన్నదే యోగాంధ్ర ప్రధాన లక్ష్యం : ప్రత్తిపాటి

  • చంద్రబాబు యువకుడిలా ఉత్సాహంగా పనిచేయడానికి కారణం యోగానే : ప్రత్తిపాటి.
  • యోగా దినచర్యలో భాగమైతే ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు :ప్రత్తిపాటి. 21న విశాఖపట్నం ఆర్ కే బీచ్ వద్ద కనీవినీ ఎరుగని విధంగా జరిగే యోగాంధ్ర వేడుకలు గిన్నిస్ రికార్డులకు ఎక్కడం ఖాయమని, రాష్ట్ర జనాభాలో 25 శాతమైనా నిత్యం యోగా చేసేలా చూడాలన్నదే యోగాంధ్ర నిర్వహణ ప్రధానోద్దేశమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వైజాగ్ ఆర్ కే బీచ్ లో జరుగుతున్న యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లు, ప్రధాన వేదిక నిర్మాణ పనుల్ని ప్రత్తిపాటి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశకత్వం… ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ప్రత్తిపాటి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఆయన… అధికారులతో కలిసి ఆర్ కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు జరుగుతున్న పనుల్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టు చెప్పారు. ప్రధాని మోదీ హాజరవుతున్నందున అధికారయంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని, యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్ కేటాయించిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించాలన్నారు.