TEJA NEWS

హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత..

వరంగల్‌ జిల్లా: హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత
తోలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్‌ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా రూ. 30 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ హోంగార్డ్‌ విభాగానికి చెందిన వి.సుధాకర్‌ మామూనూర్‌ నాల్గవ పటాలంలో విధులు నిర్వహిస్తుండగా గత ఆగస్టు 13వ తేదిన మామూనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్‌ సుధాకర్‌ మరణించారు.


TEJA NEWS