TEJA NEWS

32వ వార్డు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్


వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డులో తాజామాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి కేడి ఆర్ నగర్ లోని ఇంటింటికి తిరిగి వార్డుప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే పిచ్చి మొక్కలు దోమల వల్ల డెంగు మలేరియా మసూచి వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని గల్లి గల్లి కి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తూ ఇంటిలోని చెత్త పరిసరాలలో వేయకుండా తొలగించిన పిచ్చి మొక్కలను తొలగించేసి మున్సిపల్ ట్రాక్టర్లు లో వేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మాజీ కౌన్సిలర్ కోరారు అలాగే మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డులో పాకింగ్ పొగ స్ప్రే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.