TEJA NEWS

టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌).. 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో కానిస్టేబుల్ పోస్టులు 4,208, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 452 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

మే 14వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, పట్నా, ప్రయాగ్‌రాజ్, సిలిగురి, తిరువనంతపురం, రాంచీ, సికింద్రాబాద్, గోరఖ్‌పూర్.

వీటిల్లో కానిస్టేబుల్ పోస్టులు 4,208, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 452 వరకు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీలో ఉత్తీర్ణతత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. జులై 01, 2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సై పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 15 నుంచి మే 14, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250, ఇతరులకు రూ.500 దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఎస్సై పోస్టులకు నెలకు రూ.35,400, కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.21,700 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు.


TEJA NEWS