TEJA NEWS

ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత

నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ కె .నాగబాబు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని అన్నారు. చనిపోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్. సుభాని, పఠాన్ ఖాదర్ బాషా, పాపన హనుమంతరావు, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.