TEJA NEWS

50 సంవత్సరాల నట ప్రస్థానం.. చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ప్ర‌స్తుతం బాగా వైర‌ల్ అవుతోంది. త‌న న‌ట ప్ర‌స్థానానికి యాభై ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అప్ప‌టి రోజుల‌ను గుర్తు చేసుకోవ‌డం ఈ పోస్టులో ఉంది.

“డిగ్రీ చ‌దువుకునేట‌ప్పుడు న‌ర్సాపూర్‌ వైఎన్ఎం కాలేజ్ లో రంగ‌స్థ‌లం మీద రాజీనామా అనే తొలి నాట‌కం వేశాను. న‌టుడిగా తొలి గుర్తింపు వ‌చ్చింది. అది బెస్ట్ యాక్ట‌ర్‌ను చేయ‌డంతో పాటు ఎన‌లేని ప్రోత్సాహాన్ని అందించింది. 1974 -2024: 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం!” అని చిరు త‌న పోస్టులో రాసుకొచ్చారు.

దీనికి అప్ప‌టి త‌న పాత ఫొటోను జోడించారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ షేర్ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మెగా అభిమానులు దీన్ని ​తెగ షేర్ చేస్తున్నారు.


TEJA NEWS