రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందితే,పట్టించుకోని ముఖ్యమంత్రి
అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ
సమస్యల వలయంలో వనపర్తి ప్రభుత్వ జూనియర్కళాశాల
ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వచ్చినావు రేవంత్ రెడ్డి……….ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్
వనపర్తి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో ఇప్పటివరకు 51 మంది విద్యార్థులు మృతి చెందితే రాష్ట్ర మంత్రులు, గాని ముఖ్యమంత్రి గాని స్పందించకపోవడం కనీసం విచారణ జరిపించకపోవడం దారుణమని అలాంటి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారో సమాధానం చెప్పాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ సాతర్ల అర్జున్ ప్రభుత్వ పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి జిల్లాలోని మదనాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి మృతిచెందితే ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ పాఠశాలను సందర్శించకపోవడం విద్య, విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో సందర్శించి కళాశాలలో నెలకొన్న సమస్యలపై స్పందిస్తూ జూనియర్ కళాశాలకు పక్కా భవనము లేక వర్షం పడితే క్లాసులు కూడా సరిగ్గా జరగనిపరిస్థితి ఉందని స్కావెంజర్లు అటెండర్లు ఆరు నెలలుగా లేక కళాశాల మురికి కూపంగా తయారైందని మహిళా కళాశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థినిల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఒక వనపర్తి జిల్లా కేంద్రం లోనే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాఇదే పరిస్థితి నెలకొందని పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా పంపిస్తే ఏమైనా తమ సమస్యలు తీరుతాయని అనుకుంటే జిల్లా ప్రజలకు ఆవేదనే మిగిలిందనిఅర్జున్ విమర్శించారు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్య లు, సమస్యలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు