టంగుటూరి ప్రకాశం 67వ వర్ధంతి*

టంగుటూరి ప్రకాశం 67వ వర్ధంతి*

TEJA NEWS

తెల్లవాని తుపాకికి ఎదురు నిలిచిన ధైర్యశాలి మన తెలుగు బిడ్డ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు*

సాక్షిత : కుసుమ సిద్ధారెడ్డి
జాతియోద్యమ ప్రచారకులు

స్వతంత్ర ఉద్యమ సమయంలో దక్షణాది రాష్ట్రాలలోని ఉద్యమ నాయకులలో అగ్రగన్యుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు తన ఉపన్యాసాలతో వేలాది మందిని చైతన్యపరిచి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసిన చైతన్య మూర్తి ఆ రోజుల్లో వందల కోట్ల విలువ చేసే తన ఆస్తిని స్వతంత్ర ఉద్యమానికి ధార పోసిన త్యాగశీలి. తెల్లవాడి తుపాకులకు తన రొమ్ములను చూపించి ఎదురు నిలిచిన ధైర్యశాలి గొప్ప దేశభక్తుడు ప్రకాశం . 1872 ఆగస్టు 23న ఒంగోలు జిల్లాలోని మారుమూల గ్రామమైన వినోద రాయుడు పాలెంలో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణయ్య తల్లి సుబ్బమ్మ ఆయన విద్యాభ్యాసం ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, మద్రాసు, ఇంగ్లాండ్ లో చదువుకున్నారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడం ప్రకాశం చాలా పేదరికంలో అనేక ఇబ్బందులకు గురైనారు తన గురువు హనుమంతరావు నాయుడు సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించారు ఒంగోలు లో మిడిల్ స్కూల్లో ప్రకాశం చదువుతుండగా మూడు రూపాయలు ఫీజు చెల్లించలేని పేదరికం. ప్రకాశం ని తన తల్లి సుబ్బమ్మ తన పట్టుచీరను అమ్మి మూడు రూపాయలు ప్రకాశం కి స్కూల్ ఫీజు చెల్లించారు. అలా పేదరికంలోనూ ఎంతో క్రమశిక్షణగా పట్టుదలతో తన గురువు హనుమంతరావు నాయుడు ఆర్థిక సహకారంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించి మద్రాసులోనే గొప్ప లాయర్ గా పేరుగాంచారు. ఆ రోజుల్లోనే రోజుకు వెయ్యి రూపాయలు ఫీజుగా తీసుకునేవారు కొన్ని సందర్భాల్లో నెలకు లక్ష రూపాయలు కూడా తీసుకున్నారు మిగతా లాయర్ల కంటే కూడా ఎక్కువ ఫీజు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన మీది నమ్మకంతో అనేక కేసులు ఆయన వద్దకే వచ్చేవి తన వృత్తిలో బాగా సంపాదించి ఆ రోజుల్లోనే తోటలు బంగ్లాలు భూములు సంపాదించి కోటీశ్వరుడు గా కోట్లు సంపాదించుకున్నారు. మద్రాస్ రాకుమారుడు గా కూడా పేరు సంపాదించుకున్నారు మద్రాసు, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు పలు ప్రాంతాలలో ఆస్తులు అంతస్తులు సంపాదించి దేశంలోనే గొప్ప లాయర్ గా పేరు సంపాదించిన మేధావి. ప్రకాశం రాజకీయ జీవితం 1899లో పాతికేళ్ల వయసులోనే రాజమండ్రి పురపాలక కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1991 లో రాజమండ్రి పురపాలక చైర్మన్ అయ్యారు. 1993లో స్వామినాథ అయ్యంగారి సలహా ఆర్థిక సహకారంతో విదేశాల్లో బారిష్టర్ విద్యను పూర్తి చేశారు. 1997లో బారిష్టర్ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన ప్రకాశం ఇండియాకు వచ్చారు. అప్పటి నుండి లాయర్ వృత్తిలో 14 ఏళ్ల పాటు ఎవరు సంపాదించలేనంత ఆస్తులు సంపాదించారు. మద్రాస్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేశారు 1917లో ప్రకాశం రాజకియాలలో ప్రవేశించారు అదే సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం 1922 పన్నుల నిరాకరణ ఉద్యమంలోనూ అనేక గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్య పరిచారు. ఆ సందర్భంగా అరెస్టై చైల్డ్ జీవితం కూడా అనుభవించారు. జాతీయ రాజకీయాల్లో జాతీయ ఉద్యమంలో గాంధీ, నెహ్రూ, పటేల్, తిలక్ అనేకమంది నాయకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే జాతీయ కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రముఖుడు ప్రకాశం గారు స్వరాజ్య పత్రికను సంపాదించి ఆ పత్రికను తెలుగులోను ఇంగ్లీషులోనూ ప్రచురించి జాతీయ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన చైతన్య శీలి ప్రకాశం గారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలోనూ విస్తృత ప్రచారం చేసి జైలుకు వెళ్లారు ప్రజల చేత విరాళాలు సేకరించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరణించిన కుటుంబాలను ఆదుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఈ సందర్భంగా అనేక ఇబ్బందులు అవమానాలకు కూడా గురయ్యారు అయినా నిరుత్సాహపడకుండా ఎదిరించి నిలబడిన మొక్కవోని ధైర్యం ప్రకాశం గారిది 1946లో అన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ని అత్యంత మెజార్టీతో గెలిపించారు ప్రకాశం రాష్ట్ర ముఖ్య నాయకుడైన ప్రకాశం ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు కానీ ప్రకాశం ముఖ్యమంత్రిగా రాజాధి పేరును సూచించిన త్యాగమూర్తి ప్రకాశం స్వతంత్ర ఉద్యమ సమయంలో పత్రికను నడపడంలో ఉద్యమానికి ప్రకాశం సంపాదించిన యావద ఆస్తిని త్యాగం చేసి చివరకు అప్పులు కూడా చేయవలసి వచ్చింది అయినా ప్రజాసేవని మరువలేదు స్వతంత్ర ఉద్యమాన్ని విడవలేదు 1928 సైమన్ గో బ్యాక్ ఉద్యమ సమయంలో లక్షలాది మందితో మద్రాస్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆ సందర్భంగా పోలీస్ కాల్పుల్లో పార్థసారథి అనే నెల్లూరు యువకుడు మరణించారు పోలీసులు శవం చుట్టూ నిలబడి ఎవరిని దగ్గరికి రాకుండా తుపాకులు ఎక్కుపెట్టి హెచ్చరించారు అది తెలుసుకున్న ప్రకాశం శవం దగ్గరికి వెళ్తూ చొక్కా గుండెలు విప్పి ఎంతమందిని కాలుస్తారో కాల్చండి అంటూ రొమ్ము విడిచి ధైర్యంగా ముందుకు వెళ్లి శవాన్ని భుజాన వేసుకుని తీసుకెళ్లారు ప్రకాశం ఆ ధైర్యసహసాలను చూసిన ప్రజలు ఆంధ్ర కేసరి ప్రకాశం జిందాబాద్ అంటూ లక్షల గొంతులు మారు మ్రోగాయి అప్పటినుండి ఆంధ్ర కేసరిగా దేశమంతా గుర్తింపు పొందారు 1946 మద్రాస్ రాష్ట్ర మంత్రివర్గంలో రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రకాశం పనిచేసిన కాలంలో అనేక భూసంస్కరణలు భూపరిమితి చట్టాలు చేశారు సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారిని ఆదుకున్నారు బ్రతికి ఉన్నవారికి పిలిచి తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు రైతు పన్నును రద్దు చేశారు సేలం జిల్లాలో మద్యపాన నిషేధం చేశారు దేవాలయంలో అందరికీ ప్రవేశం కల్పించారు 1947లో కేరళలో జరిగిన మత ఘర్షణలు అల్లర్లను ఆపడంలో ప్రకాశం పాత్ర మరువలేనిది 1853 అక్టోబర్ న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం కర్నూలు రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారందరినీ ప్రకాశం ముఖ్యమంత్రి కాగానే విడుదల చేశారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి కొద్దికాలంలోనే 17 చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతి మంజూరు చేశారు స్వర్ణముఖి గంభీరం గడ్డ పాలేరు నగలేరు పెన్నా ఏలేరు నాగవల్లి వేగవతి మొదలగు ప్రాజెక్టులకు మంజూరు చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రతిపాదన చేసింది కూడా ప్రకాశం అని చెప్పాలి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పదవి ఉన్నా లేకపోయినా వృద్ధాప్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేశారు ప్రకాశం తాను సంపాదించిన దేశం కోసమే ఖర్చు చేసిన గొప్ప దేశభక్తుడు తాను చనిపోయే నాటికి తన దగ్గర ఐదు రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి తనకు మందులు కొనుక్కోవడానికి కూడా ఐదు రూపాయలు అయినటువంటి పేదరికంలో చివరి జీవితం ముగిసింది చివరికి 1957 మే నెల 20వ తారీఖున ఒంగోలు పర్యటిస్తూ వడదెబ్బ తగిలి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయారు 1957 మే 20 రాత్రి 75 నిమిషాలకు స్వర్గస్తులయ్యారు జీవితాంతం ప్రజల కోసం పరితపిస్తూ తన సొంత ఆస్తినంతా ధారపోసి ప్రజల కోసమే బ్రతికిన మహనీయుడు ప్రకాశం వారు మరణించి నేటికి 67 సంవత్సరాలు .

Print Friendly, PDF & Email

TEJA NEWS