TEJA NEWS

అడ్వీ టెక్నాలజీ కు ఎంపికైన 8 మంది యస్.బి.ఐ.టి. విద్యార్థులు

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడ్వీ టెక్నాలజీ కు తమ కళాశాల నుండి 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ఛైర్మన్ జి. కృష్ణ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్స్్కు ముఖ్య అతిధిగా హాజరైన కృష్ణ, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని టెక్నాలజీలపై అవగాహనా కలిగి ఉండాలని సూచించారు. డ్రైవర్లెన్ వెహికిల్స్ మరియు రోబోటిక్స్ కూడా ఇలా ఆవిర్భవించినవే అని వారు గుర్తు చేసారు.

మేక్ ఇన్ ఇండియా వారి సౌజన్యంతో నిర్వహించే ప్రాజెక్ట్లకు క్లేయింట్ అయిన అడ్వీ టెక్నాలజీ తమ కళాశాలను సందర్శించటం, తమ విద్యార్థులను ఎంపిక చేయటం పట్ల కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి హర్షం వ్యక్తం చేసారు. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్ కు జరిగిన ఎంపికలో ప్రతిభ చూపించిన 8 మంది విద్యార్థులకు వార్షిక వేతనంగా 7 నుంచి 8 లక్షల రూపాయలు అందుతుందని వారు తెలిపారు.

విద్యార్థులు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. వైద్య, రోబోటిక్స్, టెలీకమ్యూనికేషన్ రంగాలలో రానున్న రోజులలో విపరీతమైన టెక్నాలజీ కొరత ఏర్పడుతుందని, ఆయా రంగాలలో విద్యార్థులు నైపుణ్యత సాధించాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడ్వీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సి.ఈ.ఓ. డా॥ మనుసూధన్ బి.యస్., చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ లలిత. యస్., కళాశాల అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, గుండాల ప్రవీణ్ కుమార్, డా|| జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS